Keerthy Suresh: నేను సింగిల్ అని చెప్పానా?.. షాకింగ్ కామెంట్ చేసిన కీర్తి సురేష్!

by sudharani |
Keerthy Suresh: నేను సింగిల్ అని చెప్పానా?.. షాకింగ్ కామెంట్ చేసిన కీర్తి సురేష్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ మహానటిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రఘుతాత’. సుమన్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆక ఆగస్టు 15న ‘రఘుతాత’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో సినిమాతో పాటు పర్సనల్ విషయాలు కూడా పంచుకుంది ఈ బ్యూటీ.

‘కెరీర్ స్టార్టింగ్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను నటించన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందటంతో.. నన్ను విపరీతంగా విమర్శించారు. కొంత మంది మాటలకు చాలా బాధపడేదాన్ని. ఇక ‘మహానటి’ సినిమా తర్వాత నాపై వచ్చే నెగిటివిటీ తగ్గింది. నేను కూడా విమర్శలను తీసుకోవడం స్టార్ట్ చేశారు. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. కానీ కొంత మంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చింది.

ఇక ఆమె పెళ్లిపై స్పందిస్తూ.. ‘పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవం ఇచ్చుకుంటూ జీవించడం’ అని తెలిపింది. ఇంతలో మరో విలేకరి.. ‘మీరు సింగిల్‌గా ఉంటున్నారా.. బోర్‌గా అనిపించడం లేదా?’ అని ప్రశ్నించింది. దానిపై స్పందించిన కీర్తి.. ‘నేను సింగిల్ అని చెప్పలేదుగా’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ప్రజెంట్ కీర్తి సురేష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story