నాకు ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్‌ డేనే అంటున్న Keerthy Suresh

by Prasanna |   ( Updated:2023-08-06 02:56:11.0  )
నాకు ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్‌ డేనే అంటున్న Keerthy Suresh
X

దిశ, వెబ్ డెస్క్: కీర్తి సురేష్‌కి ఈ ఏడాది బాగా కలసి వచ్చింది. 'దసరా', 'నాయకుడు' సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకెళ్తుంది. ఈ ముద్దుగుమ్మ 'భోళా శంకర్‌' సినిమాలో చిరుకి చెల్లెలిగా నటించిన విషయం మనకి తెలిసిందే. ఈ సినిమాకి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు. ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది కీర్తి.

''నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు . నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారితో గడుపుతుంటా.. నాకు బ్రదర్‌ లాంటి ఫ్రెండ్స్‌ కూడా చాలా మంది ఉన్నారు. 'భోళా శంకర్‌' వల్ల చిరుతో మంచి స్నేహ బంధం ఏర్పడింది. మా అమ్మకు చిరు సార్ మంచి మిత్రుడు. కానీ ఇప్పుడు ఆయన నాకు కూడా ఫ్రెండ్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే ని ప్రత్యేకంగా జరుపుకోవడమన్నది నాకు తెలియదు. ఎందుకంటే ఏడాది మొత్తం నేను నా స్నేహితులతో ఎంజాయ్ చేస్తూనే ఉంటా.. కాబట్టి నా దృష్టిలో ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్‌ డేనే'' అంటూ కీర్తి సురేష్ తన మాటల్లో చెప్పుకొచ్చింది.

Also Read: ఈ వారం OTTలో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే..

Advertisement

Next Story