Keerthy Suresh: ఆ పాత్ర పోషించినందుకు దారుణంగా విమర్శించారు: కీర్తి

by Prasanna |   ( Updated:2023-03-24 13:55:30.0  )
Keerthy Suresh: ఆ పాత్ర పోషించినందుకు దారుణంగా విమర్శించారు: కీర్తి
X

దిశ, సినిమా : స్టార్ నటి కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాకుగానూ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు చెప్పింది. తాను నటించిన తాజా చిత్రం ‘దసరా’ మార్చి 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి కెరీర్‌లో ఎదురైన చేదు జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. ‘‘మహానటి’ ప్రాజెక్ట్‌ను అంగీకరించినందుకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజానికి మొదట్లో ఈ సినిమా చేయడానికి నేను ఒప్పుకోలేదు. సావిత్రమ్మ పాత్ర పోషించాలంటే భయమేసింది. నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో చేయగలిగాను. దర్శకుడే నన్ను అంతగా నమ్మినపుడు నేనెందుకు భయపడాలనుకున్నా. సావిత్రమ్మ కూతురితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నా. అయితే ‘ఈ మూవీలో నటించింనందుకు మీపై వస్తున్న విర్శలపై ఎలా స్పందిస్తారు?’ అని ఓ విలేఖరి నన్ను ప్రశ్నించారు. అప్పటికీ ట్రోలింగ్ జరుగుతోందని నాకు తెలియదు. ఆయన ప్రశ్నతో షాక్ అయ్యాను. అలా ఈ చిత్రంతో చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. ఏది ఏమైనా ఆమె పాత్రలో నటించినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. చివరగా ‘దసరా’లోనూ తాను పోషించిన వెన్నెల క్యారెక్టర్ అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తుందని చెప్పింది.

Advertisement

Next Story