త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మహానటి.. క్లారిటీ ఇదే?

by samatah |   ( Updated:2023-03-11 08:21:24.0  )
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మహానటి.. క్లారిటీ ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్ : నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కిర్తీ సురేష్. మహానటి సినిమాతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తీ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

అయితే ఈ మధ్యకాలంలో కీర్తీ సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలో మహానటి పెళ్లి చేసుకోబోతుంది అంటూ చాలా వార్తలు చెక్కర్లుకొడుతున్నాయి. వీటిపై కీర్తీ క్లారిటీ ఇచ్చినా, గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి కీర్తీ సురేష్ పెళ్లి వార్తలపై ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కీర్తీ పెళ్లి చేసుకోబోతుంది, తానే క్లారిటీ ఇచ్చిదంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. విషయంలోకి వెళ్లితే..కీర్తీ సురేష్, దసరా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయితే ఈ సినిమాలలో తన సన్ని వేశాలను త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్స్‌కు చెబుతుందంట. అలాగే మిగిలిన సినిమాల్లో ఒక సినిమా పూర్తి చేసి రెండు సినిమాలను పెళ్లయ్యాక కొన్ని రోజులకు చేస్తానని దర్శక నిర్మాతలతో ఒప్పందం కుదిర్చుకుందని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాగే కొత్త సినిమాలను ఒప్పుకోవడానికి ఆసక్తి చూపడం లేదంట. దీంతో త్వరలో కీర్తీ పెళ్లి చేసుకోబోతుందంటూ తమ అభిమానులు నెట్టింట్లో తెగ హడావిడి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed