చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మహానటిగా.. విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న కీర్తి సురేష్

by Anjali |   ( Updated:2023-11-15 06:01:20.0  )
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మహానటిగా.. విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న కీర్తి సురేష్
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ బ్యూటీ కీర్తి సురేష్.. సినీ కెరీలో అడుగు పెట్టి నేటితో 10 ఏళ్లు గడిచాయి. వారసత్వంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఈ భామ 2013 లో గీతాంజలి మూవీతో హీరోయిన్‌గా అవతారం ఎత్తింది. ఇక తెలుగులో ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి.. ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి అగ్రహీరోల వంటి సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

ఇక మహానటి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ చిత్రంలో కీర్తి అద్భుతంగా నటించి.. జాతీయ ఉత్తమ అవార్డు దక్కించుకుంది. అయితే కీర్తి సురేష్ సినీ కెరీర్‌లో అడుగుపెట్టి ఈ రోజుకు (నవంబరు 15)10 ఏళ్లు పూర్తి అయ్యాయి. కాగా ముందు ముందు మరిన్నీ సినిమా అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెష్ తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story