Keerthi Suresh: కేరళ అందాల నడుమ చీర కట్టులో 'మహానటి'

by Manoj |   ( Updated:2022-06-15 07:56:06.0  )
Keerthi Suresh Shares Latest Photos On instagram
X

దిశ, సినిమా: Keerthi Suresh Shares Latest Photos On instagram| 'సర్కారు వారి పాట' చిత్రంలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, లుక్‌తో అభిమానులకు షాక్ ఇచ్చింది కీర్తి సురేష్. తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కేరళలో ఓ వివాహానికి హాజరైన కీర్తి.. తన స్నేహితులతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

కేరళ అందాల మధ్య గోల్డెన్ సీక్విన్ చీరలో గ్లామ్‌రస్‌గా కనిపిస్తున్న కొన్ని చిత్రాలను పంచుకుంది. ఇక ఈ ఫొటోల్లో కీర్తి బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా కనిపించడం విశేషం. అయితే గతంలో పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్స్‌కు ప్రాధాన్యతనిచ్చిన కీర్తి.. ప్రస్తుతం కమర్షియల్ అండ్ గ్లామరస్ రోల్స్‌‌ను లైన్‌లో పెడుతోంది. కాగా ఈ సడెన్ చేంజ్‌కు కారణమేంటో ఫ్యాన్స్‌కు అర్థంకావడం లేదు.

Advertisement

Next Story

Most Viewed