కీరవాణి ఆ రోజే సంగీతం నుంచి తప్పుకోవాలనుకున్నాడు: AR Rahman

by Harish |   ( Updated:2023-01-27 11:20:07.0  )
కీరవాణి ఆ రోజే సంగీతం నుంచి తప్పుకోవాలనుకున్నాడు: AR Rahman
X

దిశ, సినిమా: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి ఏ.ఆర్ రెహమాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా తన సంగీతంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెహమాన్ తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కీరవాణి గారు చాలా గొప్ప సంగీత దర్శకుడు. కానీ, ఆయనకు తగినంత ప్రాధాన్యత దక్కలేదు. 2015లో కీరవాణి సంగీతం నుంచి రిటైర్ అవ్వాలనుకున్నాడు. కానీ, అలా అనుకున్నప్పుడే ఆయన కెరీర్ మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు మనకు ఆయనంటే ఏమిటో తెలుస్తుంది. జీవితం ముగిసిపోతుందని భావించిన వారే జీవితాన్ని మళ్లీ కొత్తగా గడపడం ప్రారంభించాలి. నేను నా పిల్లలకు ఎప్పుడూ ఇదే చెబుతాను' అని వివరించాడు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై Junior NTR ఆవేదన

Advertisement

Next Story