బలగం హీరోయిన్‌ను బైకు ఎక్కించుకొని వేదికమీదకు వచ్చిన కీరవాణి కొడుకు (వీడియో)

by Anjali |   ( Updated:2023-08-13 12:58:49.0  )
బలగం హీరోయిన్‌ను బైకు ఎక్కించుకొని వేదికమీదకు వచ్చిన కీరవాణి కొడుకు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా, బలగం ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ఉస్తాద్. ఈ చిత్రం రేపు(ఆగస్టు 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శక‌త్వంలో ర‌జినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు, సాంగ్స్‌కు, ట్రైలర్‌, టీజర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా.. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గురువారం నిర్వహించారు.

ఈ ఫంక్షన్‌కు దిగ్గజ దర్శకులు రాజమౌళితో పాటు నాచురల్ స్టార్ నాని గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ ఫంక్షన్‌లో వేదికమీదకు హీరోయిన్‌ కావ్యా కల్యాణ్ రామ్‌ను హీరో శ్రీసింహా బైకుపై తీసుకురావడం హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సినిమాలో హీరో త‌న బైక్‌ను ఉస్తాద్ అని పిలుచుకోవడం గమనార్హం.

Read Also :

ఇష్టపూర్వకంగా కమిట్ మెంట్ ఇచ్చాక.. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడొద్దు: నిహారిక

Advertisement

Next Story