- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Double Smart: బోల్డ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్.. ‘డబుల్ ఇస్మార్ట్’లో తన పాత్ర రివీల్ చేసిన హీరోయిన్
దిశ, సినిమా: రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించనున్నాడు. ఇదులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా.. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమా.. ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా.. తాజాగా ప్రమోషన్స్‌తో పాల్గొన్న హీరోయిన్ కావ్య థాపర్ సినిమా విశేషాలని పంచుకుంది.
‘ఇంత అద్భుతమైన కాంబినేషన్ ఉన్న సినిమాలో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. రామ్, సంజయ్ దత్ లాంటి బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలో నేనూ పార్ట్ కావడం చాలా హ్యాపీ. నాకు పూరి జగన్నాథ్ హీరోయిన్ అవ్వాలని ఉండేది. ఇస్మార్ట్ శంకర్‌కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్ టైన్మెంట్ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉది. పూరి గ్రేట్ డైరెక్టర్. ఆయన విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రామ్ చాలా పాషనేట్ యాక్టర్, హార్డ్ వర్క్ చేస్తారు. హైలీ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో మా కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చింది. ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే స్మార్ట్.. కొన్ని సార్లు ఇన్నోసెన్స్. నా క్యారెక్టర్ చాలా బాగుటుంది. ఇలాంటి క్యారెక్టర్ రావడం ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన తదుపరి చిత్రాల గురించి చెప్తూ.. గోపిచంద్‌తో ‘విశ్వం’ చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయని తెలిపింది ఈ యంగ్ బ్యూటీ.