అలా బతకడం నా వల్లకాదు.. అంతా ఓపెన్‌ అంటున్న కావ్య

by Vinod kumar |   ( Updated:2023-03-28 13:40:32.0  )
అలా బతకడం నా వల్లకాదు.. అంతా ఓపెన్‌ అంటున్న కావ్య
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కావ్యా థాపర్ తానెప్పుడూ ఓపెన్ మైండ్‌ సెట్‌తో ఉంటానంటోంది. అంతేకాదు తనను తాను ఏ విషయంలోనూ పరిమితం చేసుకోనంటూ తన నిజమైన క్యారెక్టర్ గురించి రీసెంట్ సమావేశంలో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలోనూ కొంతమంది తనను టార్గెట్ చేసిన ట్రోల్ చేయడాన్ని ఫన్నీగానే తీసుకుంటానన్న నటి.. దేన్నీ చెడుగా భావించి బాధపడకుండా ఉంటానని పేర్కొంది.

‘వందల మందిని ఒకేసారి ఎవరూ సంతోషపెట్టలేరు. కానీ, నేడు ప్రతి ఒక్కరూ వారి సొంత మనుషులనే విమర్శకులుగా భావిస్తున్నారు. ఒక చిన్న విషయాన్ని కూడా బయటకు పెడుతూ హంగామా చేస్తున్నారు. ప్రజలు కాస్త సెన్సిటివ్‌గా మారారు. వాస్తవానికి ఇవేమీ భయపడాల్సిన పరిణామాలు కావు. ఎందుకంటే దేనినీ హార్ట్‌కు తీసుకోవద్దు. నిరంతరం నవ్వుతూ బతకడానికి ఇష్టపడండి’ అని చెప్పింది.

Also Read: తాప్సీపై కేసు.. ఆ దుస్తులే కొంప ముంచాయి..


Advertisement

Next Story