- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈగల్‌లో రొమాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.. స్టోరీ రివీల్ చేసిన కావ్య థాపర్
దిశ, సినిమా: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఈగల్’. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవ్వనుంది.
విడుదల నేపథ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను బాలీవుడ్ మూవీ కోసం ముంబయికు షూటింగ్ కు వెళ్లాను. అక్కడ దర్శకుడు కార్తీక్ నాకు ఈ సినిమా స్టోరీ చెప్పారు. ఇక రవితేజ సినిమాలో నటించడం అనగానే వెంటనే ఒకే చెప్పేశాను. ఇందులో రొమాన్స్, యాక్షన్ దేనికదే అన్ని భిన్నంగా ఉంటాయి. రొమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
జనాలకు తప్పకుండా ఈ మూవీ నచ్చుతుంది. ఇందులో నా రోల్ నేమ్ రచన. లైఫ్ లో ఏదైనా సాధించాలనే పట్టు ఉన్న అమ్మాయిలా కనిపిస్తాను. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇక అంతే చెప్తాను (నవ్వుతూ) సినిమా మొత్తం రివీల్ చేయకూడదు. అంటూ హీరోయిన్ కావ్య థాపర్ చెప్పుకొస్తుంది. అలాగే రవితేజతో కలిసి వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ తో ఉంటారు. సెట్స్ లో సినిమాల్లో కామెడీ చేసినట్లుగానే చాలా జోక్స్ వేస్తారు. ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారని అడగ్గా.. ఫుల్ మాస్ యాక్షన్ అండ్ సూపర్ నేచురల్ చిత్రాల్లో నటించాలని ఉందని కావ్య తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- Tags
- Kavya Thapar