కత్రినా బోల్డ్‌గా టవల్ ఫైట్.. ఈ ఒక్క సీన్ చాలు సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు..!

by sudharani |   ( Updated:2023-10-18 05:41:03.0  )
కత్రినా బోల్డ్‌గా టవల్ ఫైట్.. ఈ ఒక్క సీన్ చాలు సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘టైగర్ జిందా హై’తో మంచి హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్.. ‘టైగర్ 3’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇందులో సల్మాన్ ఖాన్ ఫైట్ సీక్వెన్స్‌లు ఓ ఎత్తు అయితే.. కత్రిన చేసిన బాత్ టవల్ ఫైట్ ప్రస్తుతం హైలెట్‌గా నిలుస్తుంది. ఈ ట్రైలర్‌లో కేవలం 5 సెకన్ల పాటు కొనసాగిన కత్రిన టవల్ ఫైట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

ఇందులో బాత్ టవల్స్ ధరించిన కత్రినతో సహా మరో లేడీ ఫైట్ సీన్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకరి టవల్‌ను మరొకరు లాక్కోవడంతో.. ఇద్దరూ తమ బాడీని కవర్ చేసుకుంటూ చేసిన బోల్డ్ ఫైటింగ్ స్టైల్ సీక్వెన్స్ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నాయి. ఈ సీన్ ఒక్కటే సినిమా స్పెషల్ ఇంట్రెస్ట్‌ను పెంచడంతో.. ఈ ఒక్క సీన్ చాలు సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్-12 న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

Next Story