Katrina Kaif : విజయ్ మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ.. చిత్ర బృందం రియాక్షన్ ఏంటంటే?

by sudharani |
Katrina Kaif : విజయ్ మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ.. చిత్ర బృందం రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజా చిత్రం ‘మహారాజ’. విభిన్న కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శతక్వం వహించాడు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ థియేటర్‌లో విడుదల మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతే కాకుండా బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టినట్లు టాక్. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

కాగా.. ప్రజెంట్ ‘మహారాజ’ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. అత్యధిక వ్యూస్‌తో ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. అయితే.. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్.. దీనిపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసింది. ఈ మేరకు ‘వాట్ ఏ ఫిల్మ్.. సినిమా చాలా బాగుంది. కథను తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంది’ అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ పోస్ట్‌పై ‘మహారాజ’ మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story