ప్రెగ్నెన్సీ గ్లోతో Katrina Kaif.. కంగ్రాట్స్ చెప్తున్న అభిమానులు..

by sudharani |   ( Updated:2023-01-07 12:26:09.0  )
ప్రెగ్నెన్సీ గ్లోతో Katrina Kaif.. కంగ్రాట్స్ చెప్తున్న అభిమానులు..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌తో కలిసి ముంబై సిద్ధివినాయక్ టెంపుల్‌ను సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతుండగా.. ఆమె ప్రెగ్నెంట్‌తో ఉందనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు అభిమానులు. గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్‌లో బేబీ బంప్ కనిపిస్తుందని, కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. అయితే దీనిపై స్పందించిన మరో ఫ్యాన్ గ్రూప్.. అలాంటిదేమైనా ఉంటే కచ్చితంగా ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. కాగా వీరి పెళ్లి అయిన కొత్తలోనే ఇలాంటి రూమర్స్ వినిపించగా.. ఇప్పటికీ దీనిపై స్పందించలేదు ఈ సూపర్ క్యూట్ కపుల్స్.

Advertisement

Next Story