కర్వా చౌత్‌ వేడుకల్లో మెరిసిన కత్రిన-విక్కీ జంట.. పిక్స్‌ వైరల్‌..!

by sudharani |
కర్వా చౌత్‌ వేడుకల్లో మెరిసిన కత్రిన-విక్కీ జంట.. పిక్స్‌ వైరల్‌..!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ కొత్త జంట కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ తమ మొదటి కర్వాచౌత్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గతేడాది డిశంబర్‌లో ఒక్కటైన ఈ జంట అత్యంత భక్తిశ్రద్ధలతో పండగను జరుపుకోగా..'తొలి కర్వా చౌత్‌' క్యాప్షన్‌తో ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రెడ్ కలర్ శారీలో నుదుట సింధూరంతో కనిపించిన కత్రిన.. భర్తతో పాటు అత్తామామలతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా ఈ వేడుకను బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఐశ్వర్యా రాయ్‌, శిల్పా శెట్టి, మౌనీ రాయ్‌, రవీనా టాండన్, సోనమ్‌ కపూర్‌, ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా తదితరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

Advertisement

Next Story