Karthika Deepam :నవంబర్ 25 ఎపిసోడ్‌లో గతం గుర్తు రాకపోయినా నేను ఎప్పటికి నీ భర్తనే అంటున్న కార్తీక్ బాబు

by Prasanna |   ( Updated:2022-11-25 05:47:48.0  )
Karthika Deepam :నవంబర్ 25 ఎపిసోడ్‌లో  గతం గుర్తు రాకపోయినా నేను ఎప్పటికి నీ  భర్తనే అంటున్న కార్తీక్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు కార్తీక దీపం (Karthika Deepam serial) ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

ఇక ఆనందరావు..హిమ, సౌందర్యల దగ్గరకు వచ్చి. కొంత సేపు కబుర్లు చెప్పి..హిమని ఆడుకోమని అక్కడి నుంచి పంపిస్తాడు. సౌందర్య, ఆనందరావులు..మోనిత గురించి ఈ విధంగా 'బాబు భవిష్యత్ ఏంటని ఆలోచిస్తుంటే భయంగా ఉంది..ఆ మోనిత ఏమో.. ఏమి పట్టించుకోవడం లేదు. ఎవరిని నమ్మిన మోనితని అసలు నమ్మకూడదు. అది ఎంతకైనా తెగిస్తుందని అనుకుంటారు.

ఇక మోనిత..తెలియకుండా ఒక అమ్మాయిని కలిసి ఫైల్ ఇచ్చి..ఆమెతో ఇలా ఏ చిన్న తేడా కూడా రాకూడదు..అని చెబుతుంది. హ సరే మేడం మొత్తం నేను చూసుకుంటాను మీరు నాకు వదిలేయండని అని చెబుతుంది. దుర్గాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాగా రెచ్చగొడుతుంది. హే ఆపు ముందు ఎక్కడికి రావాలో చెప్పు అక్కడికి వచ్చి మాట్లాడతా అని దుర్గా ఫోన్ లో చెబుతాడు. దుర్గా ఫోన్ పెట్టేశాక మోనిత బాగా నవ్వుకుంటుంది..ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

దీప బాధ పడుతూ ఉంటుంది.. అది చుసిన కార్తీక్ దీప బాధను తగ్గించడానికి దీప 'నాకు గతం గుర్తు రాకపోయినా.. వచ్చినా.. నేను ఎప్పటికి నీ భర్తనే అంటుంది.ఆ మాటలకు దీప చాలా సంతోషిస్తుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది. తరవాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.

Advertisement

Next Story

Most Viewed