- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
కోట్లు ఇచ్చినా ఆ యాడ్ చేయను.. బడా హీరోలు యంగ్ హీరోను చూసి నేర్చుకోవాలి..
దిశ, సినిమా : బాలీవుడ్ బడా హీరోలు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ అందరూ కలిసి పొగాకు యాడ్ చేశారు. నిజానికి సొసైటీలో సెలబ్రిటీ హోదాలో ఉన్న వీరు... తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఇలాంటి యాడ్స్ చేస్తే అభిమానులు ఫాలో అయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరు ఏమైపోయినా పర్లేదు అనుకుని.. డబ్బు కోసం విలువలు లేకుండా ప్రవర్తిస్తుంటారు. కుర్రాళ్లు చెడిపోయేందుకు కారణం అవుతున్నారు. అయితే యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మాత్రం ఇందుకు వ్యతిరేకం అంటూ యాడ్ ను తిరస్కరించాడు. నిమిషం యాక్ట్ చేస్తే చాలు కోట్లు కుమ్మరిస్తామన్నా ఇందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన కార్తీక్... ఈ స్థానంలో ఉండి కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అనుకున్నట్లు చెప్పాడు.
కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. బడా హీరోలు కార్తీక్ ను చూసి బుధ్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. అన్ని కోట్లు కూడబెట్టి ఇప్పటికీ ఎందుకు కక్కుర్తిపడుతున్నారో అర్థం కావడం లేదంటూ విమర్శిస్తున్నారు. యంగ్ హీరో తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఔట్ సైడర్ గా గొప్ప పని చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు.