నా హృదయంలో అమ్మాయి ప్రేమకు స్థానం ఉంది: Kartik

by Hamsa |   ( Updated:2022-12-06 09:08:24.0  )
నా హృదయంలో అమ్మాయి ప్రేమకు స్థానం ఉంది: Kartik
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన లవ్ అండ్ మ్యారేజ్ గురించి ఓపెన్ అయ్యాడు. రీసెంట్‌గా డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైన తన మూవీ 'ఫ్రెడ్డీ' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన తాజా ఇంటరాక్షన్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మరో మూడు, నాలుగు నెలల వరకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని మా అమ్మకు చెప్పాను. దీంతో నన్ను పనిపై దృష్టి పెట్టాలని, ఈ విషయంలో అస్సలు డిస్టర్బ్ కాకుండా ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలిపింది. మ్యారేజ్ విషయంలో కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేనందుకు ఆనందంగా ఉన్నా. నా జీవితంలో అమ్మాయి ప్రేమకు స్థానం ఉంది. తొందరలోనే నన్ను వరుడిగా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతా' అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్తపై స్పందిస్తున్న ఫ్యాన్స్ సారా అలీఖాన్ తర్వాత ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఆ సినిమాలో సత్యదేవ్‌ను నేనే సెట్ చేశా: Tamannaah

Advertisement

Next Story