వాళ్లతో కాఫీ తాగే టైమ్ కూడా లేదు: డేటింగ్ రూమర్స్‌పై కార్తీక్

by Hamsa |   ( Updated:2023-01-23 07:39:45.0  )
వాళ్లతో కాఫీ తాగే టైమ్ కూడా లేదు: డేటింగ్ రూమర్స్‌పై కార్తీక్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరోసారి డేటింగ్ రూమర్స్‌పై స్పందించాడు. అతడు నటించిన తాజా మూవీ 'షెహజాదా' ఫిబ్రవరి 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌‌లో పాల్గొంటున్న కార్తీక్.. లవ్ ఎఫైర్లపై ఎదురైన ప్రశ్నలకు సమాధానామిచ్చాడు. ఈ మేరకు 'లవ్ ఆజ్ కల్ 2' షూటింగ్ సమయంలో సారా అలీ‌ఖాన్‌‌తో డేటింగ్ చేశారని రూమర్స్ వచ్చాయి? 'పతీ పత్నీ ఔర్ వో' సినిమా చేస్తున్నపుడు అనన్య పాండే‌తో రిలేషన్ షిప్‌ను కొనసాగించారనే వదంతులు ఉన్నాయి? అనే సందేహాలపై మాట్లాడుతూ..'నేను ఎవరిని ప్రేమించడం లేదు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా. అనన్య, సారాతో కలసి నటించానే తప్ప ప్రేమించలేదు. నాకు డేటింగ్ చేసే సమయం లేదు. రాబోయే రెండేళ్ల పాటు నా డేట్స్‌ను 'సాజిద్ నడియడ్ వాలా'కు ఇచ్చేశా. కాబట్టి ఇతరులతో కలసి కాఫీ తాగేంత టైమ్ కూడా ఇవ్వలేను' అంటూ స్పష్టం చేశాడు.

Advertisement

Next Story