- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్తీ నటనకు జపాన్ ఫ్యాన్స్ ఫిదా.. ఏకంగా ఇండియాకే వచ్చేశారు
దిశ, సినిమా: తమిళ్ యంగ్ హీరో కార్తీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన ప్రతిష్టాత్మకమైన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న విడుదలవగా.. ఇందులో తన నటనా నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాడు కార్తీ.
ఈ క్రమంలోనే జపాన్‌లో ఈ సినిమా చూసి కార్తీ నటనకు ఫిదా అయిన అక్కడి ఫ్యాన్స్ తనకోసం ప్రత్యేకంగా ఇండియాకు వచ్చి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఓ ట్విట్టర్ యూజర్ నెట్టింట పోస్ట్ చేస్తూ.. ‘కార్తీ డై హార్డ్ ఫ్యాన్స్.. టెరుమి & ఇసావో శాన్. అతన్ని చూడటానికి జపాన్ నుంచి వచ్చారు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోల్లో కార్తీ వాళ్లిదరికీ ఓ ప్రత్యేక జ్ఞాపికను అందించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : ‘‘గ్రీన్ ఇండియా’’ ఛాలెంజ్‌లో సింగర్ శ్రేయా ఘోషల్.. MP సంతోష్‌తో కలిసి సందడి