మరో సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు రెడీ అవుతున్న కార్తీ

by Anjali |   ( Updated:2023-08-10 12:43:51.0  )
మరో సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు రెడీ అవుతున్న కార్తీ
X

దిశ, సినిమా: పేరుకు తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు హీరో కార్తీ. రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీలో చాలా క్యారేక్టర్స్ ఉన్నప్పటికి కార్తీ మాత్రం సెపరేట్ ఫేమ్‌ను దక్కించుకున్నాడు. ఇక తాజాగా కార్తీ తన కెరీర్ బిగ్ హిట్ ‘సర్దార్‌’ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ మూవీ తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. దీంతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Advertisement

Next Story