పోలీసుల పనితీరుపై స్పందించిన నటి.. ఆ వీడియో పోస్ట్ చేస్తూ..

by Disha daily Web Desk |
పోలీసుల పనితీరుపై స్పందించిన నటి.. ఆ వీడియో పోస్ట్ చేస్తూ..
X

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా చెప్పుకునే పోలీసులు కొవిడ్ గురించి అవగాహన పెంచడానికి ప్రత్యేక పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పుణెకు చెందిన పోలీసు బృందం సరికొత్త విధానంలో ప్రజలను గైడ్ చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఈ వీడియోపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. తన గ్రాండ్‌ ఫాదర్ రాజ్‌ కపూర్ నటించిన చిత్రం 'మేరా నామ్ జోకర్' ఆధారంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం బ్రిలియంట్‌గా ఉందని తెలిపింది. ఇక ఈ వీడియోలో 'ఏ భాయ్ జర దేఖ్ కే చలో' అంటూ పాటపాడుతున్న పోలీసులు.. చిన్న జలుబే అని నిర్లక్ష్యం చేయకుండా మాస్క్ ధరించమని కోరుతుండటం విశేషం.

https://www.instagram.com/tv/CYy-0O2KK5z/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story