- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kareena Kapoor: మొత్తానికి హాలీవుడ్ సినిమాలపై స్పందించిన కరీనా కపూర్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ కామెడీ చిత్రాల నుంచి క్రైం డ్రామాల వరకు ఎన్నో సినిమాల్లో నటించి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో స్టార్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. అత్యంత రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఈ భామ ఒకరు. 2000 సంవత్సరంలో రెఫ్యూజీ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కరీనా అత్యంత సమయంలోనే బాలీవుడ్‌నే ఏలే స్థాయికి ఎదిగింది. తర్వాత కభీ ఖుషీ కభీ గమ్ , చమేలీ, దేవ్, జబ్ వియ్ మెట్, 3 ఇడియట్స్, బాడీగార్డ్, రా.వన్, భజరంగీ భాయీజాన్, కుర్బానా వంటి సినిమాల్లో అద్భుతంగా నటించింది. అంతేకాకుండా కరీనా స్టేజ్ ఫార్మార్మెన్స్ కూడా ఇస్తుంది. మూడు పుస్తకాలను రచించింది కూడా. అందులో ఒకటి తన జీవిత చరిత్ర, రెండో పోషకవిలువలకు సంబంధించిన పుస్తకం.
ఇకపోతే ఈ బ్యూటీ నటించిన ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’ అనే సినిమా నేడు (సెప్టెంబరు 13)థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. మూవీ విడుదలకు ముందు కరీనా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’ మూవీలోని తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. ‘ఈ సినిమా అంతా పిల్లాడి హత్య చుట్టూ తిరుగుతుందని కరీనా తెలిపింది. నేను జస్మీత్ భమ్రా అనే పోలీసు ఆఫీసర్‌తో పాటు ఓ మదర్ పాత్రలో నటిస్తాను. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అలాగే ఏక్తా కపూర్ తో కలిసి నిర్మించడం మరింత స్పెషల్ గా భావిస్తున్నాను. తను ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడుతుంటుంది.
ధైర్యాన్ని ఇస్తుంది. అయితే నేను ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించినప్పటికీ.. హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లలేదని అభిమానులు చాలా సార్లు ప్రశ్నించారు. బాలీవుడ్ లో నేను మంచి గుర్తింపు పొందాను. అనుకున్న సక్సెస్ వచ్చింది. నాకు ఇంగ్లీషు సినిమాల్లో నటించాల్సిన అవసరం ఉందని ఎప్పుడూ అనిపించలేదు. నా కెరీర్‌లో నేను సక్సెస్ సాధించిన చిత్రాలతోనే చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక హాలీవుడ్‌లో మూవీస్ చేయాల్సిన అవసరం నాకేంటి?’ అంటూ కరీనా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అలాగే తను సినిమాల్లో ఎప్పుడూ యవ్వనంగా కనిపించడానికి ట్రై చేయనని తెలిపింది. ఫస్ట్ కరీనా ఫోకస్ అంతా వర్క్ పైనే అని జాగ్రత్తగా, ఫిట్ గా మాత్రం ఉండేలా చూసుకుంటానని వెల్లడించింది. ప్రజెంట్ నా ఏజ్ 44 అయినా కూడా నాకు మేకప్ అవసరం లేదని పేర్కొంది. తన వయసుకు తగ్గ పాత్రల్లోనే నటిస్తున్నానని గర్వంగా చెప్పుకొచ్చింది.