- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచి కథకు వేదికలతో పనిలేదు: ఓటీటీలపై Kareena Kapoor Khan
X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఓటీటీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొవిడ్ కారణంగా ఓటీటీలకు అలవాటైన ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్లకు వెళ్తున్నారని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ప్రజలు ఎప్పుడూ వినోదాన్ని కోరుకుంటారు. మంచి సినిమాను, కథలను తప్పకుండా ఆదరిస్తారు. కంటెంట్ బాగుంటే ఏ ప్లాట్‌ఫామ్ అయినా ప్రేక్షకాదరణ పొందుతుంది.
కాబట్టి ప్రేక్షకులు ఎలాంటి చిత్రాలు కోరుకుంటున్నారో నటులు గుర్తించాలి. రచయితలు కూడా ఆసక్తికరమైన కథలు రాయాలి. కొత్త కొత్త అంశాలపై ఫోకస్ చేయాలి. మేము ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్న సినిమాలే ఆడియన్స్‌ను అలరిస్తాయి. అయితే 'ఓటీటీలో ఎలాంటి సినిమానైనా చూస్తారు' అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకసారి మూవీ బాలేదని టాక్ వచ్చిన తర్వాత ఎక్కడా చూడరు' అంటూ తన అభిప్రాయాలు వెల్లడించింది.
Advertisement
Next Story