Rave Party: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటూ హేమకి ఇచ్చి పడేసిన కరాటే కల్యాణి

by Prasanna |   ( Updated:2024-05-22 05:47:53.0  )
Rave Party: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటూ హేమకి ఇచ్చి పడేసిన కరాటే కల్యాణి
X

దిశ, సినిమా: బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నటి హేమపై కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్ చేసింది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని శిక్షించాలని .. హేమని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కరాటే కళ్యాణి చెప్పింది.

నేను మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీగా చెబుతున్నా.. తప్పు చేసిన వారిని వదిలి పెట్టొద్దు.. వారు ఆడ అయినా మగ అయినా.. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే.. అసలు ఈ రేవ్ పార్టీలు పెట్టేవారిని రేవు పెట్టేయాలి.. పార్టీ అని పేరు పెట్టి ఇష్టమొచ్చినట్టు డ్రగ్స్ వినియోగిస్తూ.. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. రూ.50-60 లక్షలు పెట్టి రేవ్ పార్టీలు చేసుకోవడం అంత అవసరమా.. ? మీరు ఎంజాయ్ చేయాలంటే.. ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి.. ఈ పార్టీలు కల్చర్ మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి. ఒకరు తప్పు చేసినా ఇండస్ట్రీ మొత్తన్ని అంటున్నారు.

హేమని ఎవరూ ఇరికించలేదు.. ఆమె నోట్లో మాట ఆగదు .. ఆమె కోపమే ఆమెకి శత్రువు అయింది.. అయ్యో హేమక్కా ఇలా అయిపోయావేంటి.. నిన్ను చుస్తే జాలేస్తుంది. ఈ కేసు నుంచి హేమ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నా.. ఆమెకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. తప్పు చేసినందుకు.. శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ కాబట్టి హేమని ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేస్తారు. అది మాత్రం నేను చెప్పగలను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Advertisement

Next Story