ఆత్మహత్యకు ప్రయత్నించిన కరణ్ జోహార్ (Karan Johar).. ట్వీట్ వైరల్

by Harish |   ( Updated:2022-12-15 07:06:56.0  )
ఆత్మహత్యకు ప్రయత్నించిన కరణ్ జోహార్ (Karan Johar).. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: పాపులర్ బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ కరణ్ జోహార్‌ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. 'బ్రహ్మాస్త్ర' తో భారీ నష్టాన్ని చవి చూసిన ఫిల్మ్ మేకర్.. సూసైడ్ డ్రామా ఆడినట్లు కొన్ని సోర్సెస్ చెప్తున్నాయని తెలిపాడు. దీంతో ముఖేష్ అంబానీ కరణ్‌కు రూ. 300కోట్లు ఇచ్చాడన్న కేఆర్‌కే.. 'ఇప్పుడు ప్రశ్నేంటంటే.. బ్రహ్మాస్త్ర కారణంగా దివాళా తీసినట్లు కరణ్ ఎందుకు ప్రపంచానికి చెప్పట్లేదు' అని ప్రశ్నించాడు.

కాగా ఇంతకు ముందే ఈ చిత్రం బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా తప్పని తెలిపిన విమర్శకుడు.. ఇప్పుడు ఏకంగా కరణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. రణ్‌‌బీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ కీలకపాత్రల్లో కనిపించారు.

READ MORE

బాలీవుడ్ హీరోయిన్‌ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్.. తెలుగు హీరోకి కలిసొస్తుందా?

Advertisement

Next Story