- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కరణ్ జోహార్ నాలో అది గుర్తించాడు : దిశా పటానీ
దిశ, సినిమా : ఫిలీం ఇండస్ట్రీలో నెపోటిజం, ఫేవరిజంపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లోని నెపోటిజంపై కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్లు బహిరంగంగానే ఆరోపణలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా స్టార్ నిర్మాత కరణ్ జోహార్‌ను టార్గెట్ చేస్తూ.. ‘కరణ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారికి అవకాశాలు దూరం చేస్తాడు, టాలెంట్ లేని స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తాడు’ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా కరణ్ జోహార్‌ను సమర్థిస్తూ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న దిశ మాట్లాడుతూ .. ‘ ఈ రోజు ఒక నటిగా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం కరణ్ జోహార్ మాత్రమే. భిన్నమైన సినిమాలు చేస్తూ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందడానికి కారణం కరణ్ జోహార్ కల్పించిన అవకాశం వల్లే. నేను మోడలింగ్ చేస్తున్న సమయంలో నాలోని నటనను గుర్తించాడు ఆయన. అప్పుడు నాకు 18 ఏళ్లు. అప్పుడు కనుక కరణ్ నాలో ఒక నటిని గుర్తించలేకపోయుంటే ప్రజంట్ ఇలా ఉండేదాన్ని కాదు. చాలా మంది ఇది నెపోటిజం అనుకుంటారు. కానీ నేను మాత్రం నటిగా నిరూపించుకునేందుకు ఆయన నాకిచ్చిన అవకాశం అని భావిస్తాను’ అని తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది దిశ. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.
Read More..
కొన్ని గంటల్లో అనంత్ -రాధిక పెళ్లి.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన నీతా అంబానీ (వీడియో)