Karan Johar: పెళ్లి విషయంలో తప్పు చేశానంటున్న దర్శకుడు.. అన్నింటి మీద కాన్సంట్రేట్ చేసి..

by Manoj |   ( Updated:2022-06-15 10:07:21.0  )
Karan Johar Gets Regret For not choosing life partner
X

దిశ, సినిమా : Karan Johar Gets Regret For not choosing life partner| పాపులర్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. ప్రేమ, పెళ్లి విషయంలో రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. ప్రొఫెషనల్‌గా సూపర్ సక్సెస్ అయిన తాను పర్సనల్ లైఫ్‌పై కాన్సంట్రేట్ చేయకపోవడంపై బాధపడుతున్నట్లు చెప్పాడు.

20015లో సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను ఆహ్వానించిన తాను.. ఆ పని కూడా ఐదేళ్ల ముందే చేసి ఉండాల్సిందన్నాడు. కానీ ఆలస్యంగానైనా ఈ విషయంలో రియలైజ్ అయినందుకు హ్యాపీగా ఉందని, దేవుడికి రుణపడి ఉంటానని అన్నాడు. అయితే పేరెంట్స్, పిల్లలతో ఎంత హ్యాపీగా ఉన్నా సరే భార్య పాత్రను ఎవరూ ఫుల్‌ఫిల్ చేయలేరని చెప్పుకొచ్చాడు. అందుకే ఈ విషయాన్ని గుర్తించడంలో ఫెయిల్ అయిన బాధ వెంటాడుతుందని.. ఇప్పుడు వయసైపోయింది కాబట్టి ఏం చేయలేనని తెలిపాడు.

Advertisement

Next Story