- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త ముఖాల సినిమాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు: Karan Johar
దిశ, సినిమా : బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కొత్త ముఖాలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్‌ను అరంగేట్రం చేయించిన తనకు ఈ మధ్య మార్కెట్‌లో డిమాండ్ తగ్గినట్లు చెప్పాడు. అలాగే తను కొత్త అబ్బాయి లేదా కొత్త అమ్మాయిని లాంచ్ చేసిన సినిమా చూడటానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయాడు. ఇటీవల ఓ రౌండ్ టేబుల్ చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన.. 'ఈ రోజు నేను లాంచ్ చేస్తున్న కొత్త టాలెంట్‌ని ఎవరూ ఆదరించట్లేదు. సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలు, ప్రేక్షకులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సౌత్‌లో ఖర్చులు చాలా తక్కువ పెడతారు. కానీ, బాలీవుడ్‌లో ఎక్కువగా ప్రమోట్ చేయాల్సి ఉన్నందున వ్యక్తిగత నెట్‌వర్కింగ్ ఏజెన్సీ ఖర్చులను తిరిగి పొందడంలో విఫలమవుతున్నాం. కాబట్టి ఇతర భాషలలో మార్కెటింగ్ జరుగుతున్న విధానానికి హిందీకి తేడా చూస్తే హాస్యాస్పదంగా ఉంది. కొత్తవాళ్లకు కూడా సీనియర్లతో సమానంగా భారీ ఖర్చులు పెట్టి నష్టాలపాలవుతున్నాం' అని జోహార్ నొక్కిచెప్పాడు.