'దుపట్టా' సాంగ్‌పై ట్రోలింగ్.. ఎక్కడా కనిపించడం లేదంటూ

by Sathputhe Rajesh |
దుపట్టా సాంగ్‌పై ట్రోలింగ్.. ఎక్కడా కనిపించడం లేదంటూ
X

దిశ, సినిమా : వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటించిన 'జగ్‌జగ్ జీయో' మూవీ ఈ నెల 24న విడుద కానుంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి తాజాగా 'దుపట్టా' అనే కొత్త ట్రాక్ విడుదల చేశారు మేకర్స్. ఈ రీక్రియేటెడ్ సాంగ్‌లో అనిల్ కపూర్, వరుణ్ ధావన్, కియారా అద్వానీతో పాటు మనీష్ పాల్ కూడా నటించగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'ఈ పాటకు దుపట్టా అనే టైటిల్ ఉన్నప్పటికీ అందులో ఒక్క దుపట్టా కూడా లేదు' అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు 'జగ్ జగ్ జీయో సినిమాలో ఒక్కటైనా ఒరిజినల్ ట్రాక్ ఉందా?' అంటూ కరణ్ జోహార్‌తో పాటు మేకర్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story