తారక్ అభిమానులను షాక్ ఇచ్చిన కన్నడ పోలీసులు!

by Anjali |   ( Updated:2023-05-23 10:11:32.0  )
తారక్ అభిమానులను షాక్ ఇచ్చిన కన్నడ పోలీసులు!
X

దిశ, సినిమా: తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘సింహాద్రి’ మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు చేసిన హడావుడి అంత ఇంత కాదు. కొన్ని థియేటర్లలో పటాకులు పేల్చి థియేటర్‌లోనే సిట్లను కాల్చేశారు. అలాగే కర్ణాటకలోని రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కొందరు అభిమానులు ఏకంగా మేక తలలు నరికి థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి 9మంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ వద్ద రెండు మేకలను కోసినందుకు గాను వారిని అరెస్టు చేశారు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Read More: రవితేజ సినిమాకు రాజమౌళి సలహాలు? బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్

Advertisement

Next Story