- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bollywood కాదు.. ఆ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తా: Sapathami
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ, 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ.. కన్నడ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తానంటోంది. ప్రస్తుతం వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'ది వ్యాక్సిన్ వార్' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన నటి.. తాజా ఇంటర్య్వూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'వివేక్ సార్ 'కాంతారా'లో నా నటన చూసి మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమాలో ఓ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతానని చెప్పాడు. అన్నట్లుగానే పిలిచి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు 'ఈ సినిమాలో నీవు భాగమైతే నేను సంతోషిస్తా' అన్నాడు. నాకు పంపిన స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తర్వాతే నటించేందుకు ఒప్పుకున్నా. పెద్ద స్టార్లతో పనిచేయడం ఆనందంగా ఉంది' అని చెప్పింది. అలాగే బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ.. 'అందరూ అనుకున్నట్లు బాలీవుడ్‌లోనే శాశ్వత స్థానాన్ని కోరుకోవడంలేదు. నన్ను ఆకట్టుకునే కథ దొరికితేనే నటిస్తా. ఎక్కువగా కన్నడ సినిమా ప్రాజెక్ట్‌ల కోసమే వెతుకుతున్నా. కన్నడకే నా ప్రాధాన్యత. ఆ భాష అంటే నాకు చాలా ఇష్టం' అని క్లారిటీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : వాళ్లతో కలిసి Sushant Singh బర్త్ డే సెలబ్రేట్ చేసిన Sara Ali Khan.. భావోద్వేగంలో ఫ్యాన్స్