సీతా రామం'పై కంగన రియాక్షన్.. దర్శకుడిపై కామెంట్స్

by Hajipasha |   ( Updated:2022-09-21 09:37:05.0  )
సీతా రామంపై కంగన రియాక్షన్.. దర్శకుడిపై కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'సీతా రామం' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ముందుగా దర్శకుడు హను రాఘవపూడికి శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను ఆకాశానికెత్తేసింది. 'సినిమాలో అందరు నటీనటులు అద్భుతంగా నటించారు. కానీ ఆమెకు ప్రత్యేకంగా మృణాల్ నటన నచ్చింది. నిగ్రహించబడిన భావోద్వేగాలు, అరుదైన హుందాతనం, గౌరవం.. మరే ఇతర నటులు ఆమె మాదిరిగా నటించలేరు. మృణాల్ నిజంగా క్వీన్ నువ్వు. జిందాబాద్ ఠాకూర్ సాబ్.. ఇక మీ పాలన ప్రారంభమవుతుంది' అని నోట్ షేర్ చేసింది. ఇక దీనిపై స్పందించిన మృణాల్.. చాలా హ్యాపీగా ఉందంటూ కంగనకు థాంక్స్ చెప్పింది.

Also Read : కథ తెలియకపోతే నోరు మూసుకోండి.. ట్రోలర్స్‌పై శిల్పా శెట్టి భర్త

Advertisement

Next Story