- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kangana Ranaut: నాకు బాలీవుడ్ సెట్ అవ్వదు.. ఆ వ్యక్తులు వేరు.. షాకింగ్‌గా స్టార్ హీరోయిన్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ కంగనా రనౌత్. ప్రజెంట్ ఈమె రాజకీయాల్లో బిజీగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన కంగన.. త్వరలో ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపించనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘నాకు బాలీవుడ్‌కు సెట్ అవ్వదు. ఎందుకంటే నేను అక్కడ సెట్ అయ్యే వ్యక్తిని కాదు. వాళ్లందరి లైఫ్ స్టైల్ వేరు.. నాది వేరు. షూటింగ్ లేకపోతే.. మార్నింగ్ జిమ్ చేయడం, మధ్యాహ్నం నిద్రపవడం, మళ్లీ సాయంత్రం జిమ్.. అలాగే తినడం, టీవీ చూడటం ఇదే వారి లైఫ్ స్టైల్. బయట ప్రపంచం గురించి వాళ్లు ఏం పట్టించుకోరు. ఎప్పుడు వాళ్ల బట్టలు, విలువైన వస్తువుల గురించే మాట్లాడుకుంటారు. వీటికి మించి భిన్నంగా ఆలోచించే వ్యక్తి బాలీవుడ్‌లో కనిపిస్తే ఆశ్చర్యమే’ అంటూ చెప్పుకొచ్చింది కంగన.