మహిళా శాస్త్రవేత్తల బొట్టు, మంగళ సూత్రంపై కంగన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Prasanna |   ( Updated:2023-08-28 07:43:14.0  )
మహిళా శాస్త్రవేత్తల బొట్టు, మంగళ సూత్రంపై కంగన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 విజయంలో కీలక పాత్రలు పోషించిన మహిళా శాస్త్రవేత్తలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. శాస్త్రవేత్తల సాధారణ జీవన విధానం, ఉన్నతమైన ఆలోచనలకు ప్రతిరూమని తనదైన స్టైల్‌లో కొనియాడింది. ఈ మేరకు ‘భారతదేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో బొట్టు బిళ్ల, తిలకం, మంగళ సూత్రం ధరించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారి నిరాడంబర జీవితాలకు, అత్యున్నతమైన ఆలోచనలకు ఆ బొట్టు బిళ్ల, తిలకం, తాళిబొట్టు గుర్తులే నిదర్శనం. అదే అసలైన భారతీయత లక్షణం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో శాస్త్రవేత్తల ఫొటో పోస్ట్‌ చేసింది. అంతేకాదు గతంలో ఏ దేశంలో చేపట్టని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ మాడ్యూల్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించి భారతీయులంతా గర్వపడేలా చేశారంటూ టీమ్ మొత్తాన్ని పొగిడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read: ఈ విజయం నాలాంటి వారెందరికో స్ఫూర్తి.. అచ్చం డైరీలో రాసుకున్నట్లే జరిగింది

Advertisement

Next Story