రాజమౌళి డ్రెస్సింగ్‌పై కంగన ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-01-13 05:56:46.0  )
రాజమౌళి డ్రెస్సింగ్‌పై కంగన ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 'ఆర్ఆర్ఆర్'టీమ్‌పై ప్రశంసలు కురిపించింది. 80వ వార్షిక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో 'నాటు నాటు' పాట ఉత్తమ అవార్డు గెలుచుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి డ్రెస్సింగ్ సెన్స్‌ (ధోతీ, కుర్తా) చూసి గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్న నటి.. 'గోల్డెన్ గ్లోబ్ ట్రోఫీతో పాటు భారతీయ సౌందర్యం గర్వించదగ్గ ప్రదర్శన కళ్లకు కట్టింది. ధోతీ డ్రెస్ అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌పై మెరుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ధన్యవాదాలు సర్' అంటూ పొగిడేసింది. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి, తారక్, చరణ్‌తోపాటు చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed