పెళ్లైన హీరోతో శృంగారం చేశాను : Kangana Ranaut

by Prasanna |   ( Updated:2023-07-25 13:31:01.0  )
పెళ్లైన హీరోతో శృంగారం చేశాను : Kangana Ranaut
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఎప్పుడు ముందు ఉంటుంది కంగనా రనౌత్. వరుస వివాదాలతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ పొందిన కంగన.. నటిగా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ‘‘ఇలాంటి విషయాలు చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయరు. కానీ నాకు అలాంటి భయాలేమీ లేవు. కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. బాలీవుడ్‌లో 99 శాతం మందికి డ్రగ్స్ అలవాటు ఉంటుంది. అలా ఒక స్టార్ హీరో కూడా విపరీతంగా డ్రగ్స్‌కు అలవాటు పడిపోయాడు. దీంతో అతన్ని తన వైఫ్ వదిలేసింది. ఆ తర్వాత నేను కొన్ని రోజులు ఆ హీరోతో డేటింగ్ చేశాను. ఆ సమయంలో కూడా అతను డ్రగ్స్ ఎక్కువ తీసుకునేవాడు. కొద్ది రోజులకు వాళ్ళ ఫ్యామిలీ నన్ను బెదిరించడంతో అతనికి దూరం కావాల్సి వచ్చింది’ అని ఓపెన్ కామెంట్స్ చేసింది. అయితే గతంలో కంగన, హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేసిందనే వార్తలు వినిపించాయి. అది దృష్టిలో పెట్టుకుని ఆమె మాట్లాడింది హృతిక్ గురించేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story