ఏకంగా ముగ్గురు పిల్లలతో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్..పిక్స్ వైరల్?

by Anjali |
ఏకంగా ముగ్గురు పిల్లలతో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్..పిక్స్ వైరల్?
X

దిశ, సినిమా: 2005 లో ప్రేమికులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. తర్వాత వెంటనే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ‘రణం’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో హీరోగా గోపీచంద్ నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తెలుగు పరిశ్రమలో కామ్నా జఠ్మలానీకి మంచి పేరు వచ్చింది.

తర్వాత వి వి సత్యనారాయణ దర్శకత్వంలో ‘బెండు అప్పారావు’ చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత కూడా అల్లరి నరేష్ సరసన యాక్షన్ త్రీడీ, భాయ్ చిత్రాలు చేసింది. కానీ ఇవి బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఈ హీరోయిన్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మూవీల్లో కూడా నటించింది.

ఇక 2014 లో కామ్నా జఠ్మలానీ సూరజ్ నాగ్ పాల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇద్దరు ఆడపిల్లకు తల్లి. తాజాగా కామ్నా తమ పిల్లలతో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా.. జనాలు ఆశ్చర్యపోతున్నారు. అసలు పెళ్లి ఎప్పుడైంది? కామ్నాకు ఇంత పెద్ద కుమార్తెలున్నారా? అంటూ షాక్ అవుతున్నారు. ఈ ఫొటోలో ముగ్గురు అమ్మాయిలు కనిపించడంతో ముగ్గురు పిల్లలా? లేక ఇద్దరు పిల్లలా? అంటూ సందేహాత్మకంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed