మరో రికార్డు సృష్టించిన Kamal Haasan 'Vikram..

by Hamsa |   ( Updated:2022-09-10 05:44:49.0  )
మరో రికార్డు సృష్టించిన Kamal Haasan  Vikram..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ చిత్రం జూన్ 3న రిలీజై బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, స్టార్ హీరో సూర్య రోలెక్స్‌గా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక తాజాగా, ఈ సినిమా మరో మైల్‌స్టోన్‌ను అందుకుంది. విక్రమ్ చిత్రం రిలీజ్ అయ్యి 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ విక్రమ్ 100 రోజుల పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి : Shruti Haasan ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు షాకైన ప్రేక్షకులు (వీడియో)

Advertisement

Next Story