రెజ్లర్లకు మద్దతుగా కమల్ హాసన్ ట్వీట్.. సింగర్ చిన్మయి కౌంటర్

by Hamsa |
రెజ్లర్లకు మద్దతుగా కమల్ హాసన్ ట్వీట్.. సింగర్ చిన్మయి కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన స్టార్ రెజ్లర్ తమకు న్యాయం చేయాలని గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, వీరికి మద్దతుగా స్టార్ హీరో మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. ‘‘రెజ్లర్ల నిరసనలు మొదలై నేటికి నెల రోజులు. నేషనల్ గ్లోరీ కోసం పోటీ పడాల్సిన వారిని వ్యక్తిగత భద్రత కోసం పోరాడే స్థితికి నెట్టివేశాం. తోటి భారతీయులారా.. మన అటెన్షన్‌కు అర్హులు ఎవరు? మన జాతీయ క్రీడా చిహ్నాలా లేదా విస్తృతమైన నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులా?’’ అంటూ రాసుకొచ్చారు. తాజాగా, కమల్ హాసన్ ట్వీట్‌కు సింగర్ చిన్మయి శ్రీపాద కౌంటర్ ఇచ్చింది. ‘మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులోని ఒక సింగర్‌ 5 సంవత్సరాలు నిషేధించబడింది. ఇది వారి కళ్ల ముందు జరిగినా.. ఆ కవి పట్ల వారికి గౌరవం ఉంది కాబట్టి దాని గురించి ఇంత వరకు మాట్లాడలేదు. ఇలా తమ చుట్టే జరిగిన వేధింపులను పట్టించుకోకుండా ఇప్పుడు మహిళల భద్రత కోసం మాట్లాడే రాజకీయ నాయకులను ఎలా నమ్మాలి? జస్ట్ ఆస్కింగ్’ అని ఫైర్ అయ్యింది.

Advertisement

Next Story