తలైవా బర్త్‌డే.. కమల్ హాసన్ స్పెషల్ ట్వీట్

by sudharani |   ( Updated:2023-12-17 13:03:18.0  )
తలైవా బర్త్‌డే.. కమల్ హాసన్ స్పెషల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టిన రోజు. రజినీ కాంత్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం తలైవా పేరే వినిపిస్తుంది. ఆయనకున్న కోట్లాది అభిమానులు తన అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటు సినీ ప్రముఖులు కూడా రజినీకాంత్‌కు బర్త్‌డే విషెస్ చెప్తుతున్నారు. ఈ క్రమంలోనే లోక నాయకుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తలైవాకు తన స్పెషల్ విషెస్ తెలిపాడు. ఈ మేరకు ‘అద్భుతమైన స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఈ రోజు, ఎప్పటికీ విజయాన్ని పొందుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ని మ్యూచువల్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story