Kamal Haasan : కొత్త ప్రాజెక్ట్ కమిట్ అయిన కమల్ హాసన్.. ప్రత్యేకించి రైతుల కోసమేనట..

by Anjali |   ( Updated:2023-07-02 09:56:26.0  )
Kamal Haasan : కొత్త ప్రాజెక్ట్ కమిట్ అయిన కమల్ హాసన్.. ప్రత్యేకించి రైతుల కోసమేనట..
X

దిశ, సినిమా: ‘విక్రమ్’ మూవీ బ్లాక్ బస్టర్‌తో జోరు పెంచిన కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక అదే స్పీడ్‌తో మరో రెండు మూడు సినిమాలకు కూడా సైన్ చేశాడు. ఇందులో మణిరత్నంతో చేయబోయే సినిమా కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో మూవీ వచ్చి దాదాపు 36 సంవత్సరాలు గడిచిపోగా.. ఈ చిత్రం కథ రైతుల సమస్యలపై ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కావాలనే కమల్ ప్రత్యేకంగా ఈ సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

Read More..

భారీ పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ ఓటీటీ స్టార్.. ఒక్క ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు..

Advertisement

Next Story