ఆకట్టుకుంటున్న 'Kalyanam Kamaniyam' ట్రైలర్‌!

by sudharani |   ( Updated:2023-10-12 07:34:20.0  )
ఆకట్టుకుంటున్న Kalyanam Kamaniyam ట్రైలర్‌!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కళ్యాణం కమనీయం'. UV కాన్సెప్ట్స్‌ బ్యానర్‌‌పై పెళ్లి నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా అనుష్క శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందనే సంగతి అర్థమైపోతుంది. భర్తకు ఉద్యోగం లేకపోవడం వల్ల భార్య ఫీల్ కావడం, భార్య జాబ్ చేస్తుంది కదా అని భర్త ఆ విషయాన్ని లైట్ తీసుకోవడం.. ఇలా హీరోహీరోయిన్ మధ్య గొడవ సృష్టించడం ఈ కథలో ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 14న విడుదలకానుంది.

Advertisement

Next Story

Most Viewed