మేమిద్దరం జీవితాంతం అన్నదమ్ములమే.. మా బంధాన్ని ఎవ్వరు విడదీయలేరు : కళ్యాణ్ రామ్

by Prasanna |   ( Updated:2023-12-27 04:12:09.0  )
మేమిద్దరం జీవితాంతం అన్నదమ్ములమే.. మా బంధాన్ని ఎవ్వరు విడదీయలేరు : కళ్యాణ్ రామ్
X

దిశ,వెబ్ డెస్క్: కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘డెవిల్ - ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాను డిసెంబర్ 29న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా గురించి, తన తమ్ముడు ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ సినిమా గురించి కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘డెవిల్’ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు.. దీనికి కారణం అన్నదమ్ముల మధ్య విబేధాలు వచ్చాయంటూ రూమర్లు వినిపిస్తున్నాయి .. దీనిలో ఎంత నిజమున్నదన్న ప్రశ్న కళ్యాణ్ రామ్‌కు ఎదురైంది. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, తాను జీవితాంతం అన్నదమ్ములుగానే ఉంటామని.. మా బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని అన్నారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ఇలాంటి ఆలోచన మనసులో ఉంటే తీసేసుకోవాలని సూచించారు. దేవర సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. మేం ప్రస్తుతానికి పార్ట్ 1 మీద మాత్రమే దృష్టిపెట్టాం. దేవర సినిమా ఒక విజువల్ స్పెక్టాకులర్ అని ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story