Kalki2898 AD : ప్రభాస్ ‘కల్కి’ సెన్సార్ కంప్లీట్.. రన్ టైమ్ ఎంతంటే..

by Javid Pasha |
Kalki2898 AD : ప్రభాస్ ‘కల్కి’ సెన్సార్ కంప్లీట్.. రన్ టైమ్ ఎంతంటే..
X

దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్‌న్లుగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్ సినీ ప్రేక్షకులు దీనికోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుండగా వారం రోజుల ముందే తాజాగా సెన్సార్ వర్క్ కూడా పూర్తి కాగా, యు/ఎ సర్టిఫికెట్ కూడా లభించింది. రన్ టైమ్ విషయానికి వస్తే మొత్తం 3 గంటల 56 సెకన్లుగా ఉండనుంది. సినిమా మొత్తాన్ని అన్ని కోణాల్లో పరిశీలించాక సెన్సార్ బోర్డు ప్రపోజల్ మేరకు మొత్తం1.36 నిమిషాల సీన్స్‌ను రీప్లేస్‌‌మెంట్ చేసినట్లు సెన్సార్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక త్వరలోనే మూవీ విడుదల కానున్న నేపథ్యంలో త్వరలోనే టికెట్ బుకింగ్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

Advertisement

Next Story