శంకరాభరణం విడుదలైన రోజే కన్నుమూసిన కళాతపస్వి..

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-03 07:31:48.0  )
శంకరాభరణం విడుదలైన రోజే కన్నుమూసిన కళాతపస్వి..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. తన దర్శకత్వంతో ఎన్నో అపూరూపమైన చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించి ప్రత్యేక గుర్తింపు పొందిన కె.విశ్వనాథ్ ఇకలేరు. దర్శక దిగ్గజంగా ఎన్నో క్లాస్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు కాశీ నాథుని విశ్వానాథ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. అయితే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన శంకరాభరణం ఫిబ్రవరి 2, 1980లో విడుదలయ్యింది. ఈ చిత్రం తర్వాత కె.విశ్వనాథ్ కళాతపస్విగా పేరుగాంచారు. సంగీతమే ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం విశేష ప్రజాదరణ పొందింది. పలు సందర్భాల్లో తనకు ఇష్టమైన సినిమా శంకరాభరణం అని కె.విశ్వనాథ్ తెలిపారు. ఆ సినిమా విడుదల రోజే ఆయన కన్నుమూయడం విషాదకరం.

ఇవి కూడా చదవండి : కె. విశ్వనాథ్ నటించిన చిత్రాలివే..

Advertisement

Next Story