పిల్లల పెంపకంపై కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫ్రీగా వదిలేశానంటూ

by Prasanna |   ( Updated:2023-09-06 07:11:47.0  )
పిల్లల పెంపకంపై కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫ్రీగా వదిలేశానంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాజోల్ ఇంట్రెస్టింగ్ పేరెంటింగ్ టిప్స్ షేర్ చేసుకుంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల పెంపకం, వాళ్లకు ఇచ్చే ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ.. ‘మా చిల్డ్రన్స్ నైసా అండ్ యుగ్ తమ లైఫ్‌లో ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి అసలే భయపడరు. ఎల్లప్పుడూ మరింత నేర్చుకోవడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అమ్మ వెన్నుదన్నుగా ఉందని వాళ్లకు తెలుసు. నా తల్లి కూడా మంచి, చెడు గురించి ఎప్పుడూ చెబుతుండేది. అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగివుండేలా ప్రోత్సహించేది. లింగ భేదం మరేదైనా కానీ మాకు ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్తపడేది. మనుషులంతా ఒకటే అనే వాస్తవంతో మేము పెరిగాము. ఎన్నో కట్టుబాట్లు ఉన్నప్పటికీ నాకు నచ్చిన విధంగా జీవించే హక్కును ఆమె కాలరాయలేదు. ‘మీరు బయటకు వెళ్లి ఎవరిని బాధపెట్టనంత వరకు లేదా భయంకరమైన పని చేయనంత వరకు ఓకే’ అని నిరంతరం చెబుతుండేది’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది కాజోల్.

ఇవి కూడా చదవండి: Actress Neha Shetty: నిషా కళ్ళతో చీరకట్టులో మైకం తెప్పిస్తున్న నేహా శెట్టి

Advertisement

Next Story