Kajol: కాజోల్‌కు కళ్లు కనపడవా? ఆ సర్జరీ కూడా చేయించుకుందట!

by Prasanna |   ( Updated:2023-04-14 11:25:15.0  )
Kajol: కాజోల్‌కు కళ్లు కనపడవా? ఆ సర్జరీ కూడా చేయించుకుందట!
X

దిశ,సినిమా : కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై నటి కాజోల్ ఓపెన్ అయింది. అంతేకాదు ఇటీవల తన గ్లామర్‌పై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పై కూడా స్పందించింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో మాట్లాడిన ఆమె.. ‘ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో నాకు చాలా ట్యాగ్‌లు ఉండేవి. చర్మం నలుపుగా ముదురు రంగులో ఉందన్నారు. కొంతమంది లావుగా ఉన్నావని ఎగతాళి చేశారు. కళ్లజోడు పెట్టుకుంటే.. ‘నిరంతరం కళ్లద్దాలు ధరిస్తుంది.. బహుశా అవి లేకుండా ఏమీ చూడలేదేమో’ అని గుసగుసలు పెట్టారు. నాకు ప్రతి విషయం గుర్తుంది. అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్లాను’ అని చెప్పింది. అలాగే తనకు గ్లామర్ పెరిగిందంటూ జరుగుతున్న చర్చను ఉద్దేశిస్తూ.. ‘నేను ఎలాంటి ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడట్లేదు. స్కిన్ వైటెనింగ్ సర్జరీ కూడా చేసుకోలేదు. గతంలో 10-12 ఏళ్లు విరామం లేకుండా ఎండలో పనిచేశా. ఇప్పుడు సూర్యుడికి ఎక్స్‌పోజ్ కావట్లేదు కాబట్టే ఇలా ఉన్నాను’ అని క్లారిటీ ఇచ్చింది.

Read more:

Alia Bhatt: రాజమౌళి చెప్పిన ఆ మాట ఎప్పటికీ మరిచిపోలేను.. అలియా

Advertisement

Next Story