- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నార్త్ ఇండియా మిస్టరీ థ్రిల్లర్.. ‘దోపట్టి’ నుంచి బిగ్ అప్‌డేట్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి కృతిసనన్ ఇటీవల అనౌన్స్ చేసిన తన కొత్త ప్రాజెక్ట్ ‘దోపట్టి’కి సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుపుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ నిర్మాత కనికా ధిల్లాన్ క్లాప్ ఇచ్చి సినిమా ఓపెనింగ్ చేసింది.
ఇక ఈ సినిమాతో రెండోసారి కాజోల్‌తో నటించనున్న కృతిసనన్ మూవీకి నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. కాగా నార్త్ ఇండియాలో జరిగిన ఒక మిస్టరీ థ్రిల్లర్ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. కృతిసనన్ సొంత బ్యానర్ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్, కథా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీకి కనికా ధిల్లాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. 2024లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది ఈ లేడీ మల్టీస్టారర్.