- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాజల్.. గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా.. !
దిశ, సినిమా: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా ద్యారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోయిన్‌గా కాజల్. మొదటి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది అనంతరం ‘మగధీర’ ‘చందమామ’ వంటి వరుస హిట్‌లు అందుకుంది. అలా కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూ తెలుగు, తమిళ, హిందీ, అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే కాజల్ ఓ స్టార్ హీరోతో పీకల్లోతో ప్రేమలో పడింది అంటూ.. పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఆ పుకార్లలనింటికి చెక్ పెట్టి తన చిన్ననాటి స్నేహితుడైనా గౌతమ్ కిచ్లును పెళ్ళాడి షాక్ ఇచ్చింది. ఇలా వీరి వైవాహిక జీవితంలో వెంటనే ఒక బాబుకి కూడా జన్మనిచ్చిన కాజల్, ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరిగి బిజీ అయ్యారు.
అయితే ఆమె గౌతమ్‌ని పెళ్లి చేసుకొడానికి కారణం ఉందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. ‘నాకు హీరోలను పెళ్లి చేసుకోవాలంటే భయం. ఎందుకంటే వారి ప్రయాణంలో భాగంగా హీరోలు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలియదు. ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ కావడంతో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే సినిమా హీరోలను పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేశాను. బాగా ఆలోచించి చిన్నప్పటి నుంచి నాకు ఎంతో పరిచయం ఉన్నటువంటి నా స్నేహితుడు గౌతమ్‌ని పెళ్లి చేసుకున్నాను. అతనికి ఏ విధమైనటువంటి అలవాట్లు లేవు. మంచి వ్యక్తిత్వం గల మనిషి. గౌతమ్ తో నా జీవితం చాలా హ్యాపీగా ఉంది’ అంటూ తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.